-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari engeneering colleges
-
ఇంజనీరింగ్.... ఏది బెటర్..?
ABN , First Publish Date - 2020-12-28T05:55:02+05:30 IST
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ మొదటి విద్యా సంవత్సరం కళాశాల ఆన్‌లైన్ ఎంపిక తేదీ ఖరారైంది.

నేటి నుంచే కళాశాలల ఎంపిక
నేడు, రేపు ఒకటి నుంచి 60 వేల ర్యాంకు వారికి అవకాశం
30, 31 తేదీలలో 60001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు
పదుల సంఖ్యలో కోర్సులు.. 10,080 సీట్లు
ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం సీఎస్‌ఈ 2,460 సీట్లు, ఈసీఈ 2,250 సీట్లు, మెకానికల్ 1,410 సీట్లు, ఈఈఈ 1,320 సీట్లు, సీఈ 840 సీట్లు, ఐటీ ఏఐ్క్షఎంఎల్ ఇతర కోర్సులకు 1800 సీట్లు వెరసి 10,080 సీట్లు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి.
భీమవరం ఎడ్యుకేషన్, డిసెంబరు 27 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ మొదటి విద్యా సంవత్సరం కళాశాల ఆన్‌లైన్ ఎంపిక తేదీ ఖరారైంది. ఎంసెట్–2020 ర్యాంకులు సాధించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎంపిక ప్రక్రియలోకి వెళ్లాలి. ఈ నెల 28, 29 తేదీలలో ఎంసెట్ ఒకటి నుంచి 60 వేల ర్యాంకు వరకు ఆన్‌లైన్‌లో వారికి నచ్చిన కళాశాల ఎంపిక చేసుకోవాలి. 30, 31 తేదీలలో 60,001 నుంచి చివరి ర్యాంకు వరకు ఎంపిక చేసుకోవాలి. వచ్చే నెల 1న ఎంచుకున్న కళాశాలలు మార్పు చేసుకోవచ్చు. ఎంసెట్ 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వారు చేసుకోవచ్చు. జనవరి 3వ తేదీ సాయంత్రం కళాశాలల అలాట్‌మెంట్ జరుగుతుంది. హెల్ప్‌లైన్ సెంటర్ కింద తణుకు ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులో ఉంటుంది.
కాలేజీల వారీగా కోర్సులు.. సీట్లు
ఏకేఆర్‌జీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (నల్లజర్ల) సీఎస్‌ఈ 60 సీట్లు, ఈసీఈ 60 సీట్లు, మెకానికల్ 30 సీట్లు, సీఈ 30 సీట్లు.
భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (భీమవరం) సీఎస్‌ఈ 60, ఈసీఈ 60 సీట్లు.
డిఎన్నార్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్(భీమవరం) సీఎస్‌ఈ 180, ఈసీఈ 120, మెకానికల్ 120, ఈఈఈ 60, సీఈ 60 సీట్లు.
ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (పెదవేగి) సీఎస్‌ఈ 120, ఈసీఈ 120, మెకానికల్ 60, ఈఈఈ 120, ఏఐ్క్షడీఎస్ 60 సీట్లు.
హేలాపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏలూరు) సీఎస్‌ఈ 60, ఈసీఈ 30, మెకానికల్ 60, ఈఈఈ 30, సీఈ 30 సీట్లు.
నోవా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (జంగారెడ్డిగూడెం) సీఎస్‌ఈ 120, మెకానికల్ 60, ఈసీఈ 60,ఈఈఈ 30,సీఈ 60, ఏఐ్క్షఎంఎల్ 60, పెట్రోలియం–30, అగ్రికల్చరల్–30 సీట్లు.
రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఏలూరు) సీఎస్‌ఈ 180, ఈసీఈ 180, మెకానికల్ 60, ఈఈఈ 120, సీఈ 60, సీఎస్‌ఈ సైబర్ సైన్స్ 60, సీఎస్‌ఈ (లాట్) 60, ఏఐ్క్షడీఎస్ 60 సీట్లు.
ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల (భీమవరం) సీఎస్‌ఈ 300, ఈసీఈ 240, మెకానికల్ 240, ఈఈఈ 180, సీఈ 240, ఐటీ 180, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 60, ఏఐ అండ్ డీఎస్ 60 సీట్లు.
శశి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (తాడేపల్లిగూడెం) సీఎస్‌ఈ 180, ఈసీఈ 180, మెకానికల్ 120, ఈఈఈ 120, సీఈ 60, ఐటీ 60, కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ 60, ఎలకా్ట్రనిక్ కమ్యునికేషన్ టెక్నాలజీ 60 సీట్లు.
సిఆర్‌రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఏలూరు) సీఎస్‌ఈ 180, ఈసీఈ 180, మెకానికల్ 120, ఈఈఈ 150, సీఈ 60, ఐటీ 120 సీట్లు.
శ్రీవాసవి ఇంజనీరింగ్ (తాడేపల్లిగూడెం) సీఎస్‌ఈ 240, ఈసీఈ 180, మెకానికల్ 120, ఈఈఈ 120, సీఈ 60, కంప్యూటర్ సైన్స్ 60, ఎలకా్ట్రనిక్ కమ్యూనికేషన్ 60 సీట్లు.
స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(నరసాపురం) సీఎస్‌ఈ 180, ఈసీఈ 240, మెకానికల్ 120, ఈఈఈ 60, సీఈ 60, ఐటీ 60, ఏఐ్క్షఎంఎల్ 60, రోబోటిక్స్ 60 సీట్లు.
స్వర్ణాంధ్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (నరసాపురం) సీఎస్‌ఈ 120, ఈసీఈ 120, మెకానికల్ 60, ఈఈఈ 30, ఏఐ్క్షఎంఎల్ 60 సీట్లు.
విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (భీమవరం) సీఎస్‌ఈ 180, ఈసీఈ 180, మెకానికల్ 120, ఈఈఈ 120, సీఈ 60, ఐటీ 120, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ సిస్టమ్స్ 60, ఏఐ్క్షడీఎస్ 60 సీట్లు.
వెస్ట్ గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ్క్ష ఇంజనీరింగ్ సీఎస్‌ఈ 120, ఈసీఈ 120, మెకానికల్ 60, ఈఈఈ 60 సీట్లు
శ్రీ విష్ణు మహిళ ఇంజనీరింగ్ కళాశాల(భీమవరం) సీఎస్‌ఈ 180, ఈసీఈ 180, మెకానికల్ 60, ఈఈఈ 120, సీఈ 60, ఐటీ 180, ఏఐ్క్షడీఎస్ 60 సీట్లు.