గోయెంకా కళాశాలలో వృత్తి నైపుణ్య కోర్సులు

ABN , First Publish Date - 2020-12-29T04:50:39+05:30 IST

డీఆర్‌ గోయెంకా మహిళా డిగ్రీ కళాశాలలో యూజీసీ గుర్తింపు పొందిన నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభించను న్నట్టు స్కిల్‌ డవలప్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ టి.శుకూర్‌ సోమవారం తెలిపారు.

గోయెంకా కళాశాలలో వృత్తి నైపుణ్య కోర్సులు

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 28 : డీఆర్‌ గోయెంకా మహిళా డిగ్రీ కళాశాలలో యూజీసీ గుర్తింపు పొందిన నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రారంభించను న్నట్టు స్కిల్‌ డవలప్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ టి.శుకూర్‌ సోమవారం తెలిపారు.  ఎలక్ట్రిషియన్‌, హెల్త్‌కేర్‌, హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌, ప్లంబింగ్‌, బ్రాడ్‌ కాస్టింగ్‌ జర్నలిజం, యోగా సైన్స్‌ ఏడాది కోర్సులు ప్రారంభిస్తున్నామన్నారు. కోర్సులకు ఈ నెల 31వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వృత్తి నైపుణ్య కోర్సులతో ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో కృష్ణ మోహన్‌,ఎం.కిరణ్‌కుమార్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ శివప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T04:50:39+05:30 IST