-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari education
-
ఇంటర్ అడ్మిషన్లు ఎప్పుడో..?
ABN , First Publish Date - 2020-12-29T04:34:36+05:30 IST
జూనియర్ ఇంటర్ విద్యార్థులకు కళాశాలలో ప్రవేశాలు లేక ఆందో ళన చెందుతున్నారు.

తొమ్మిది నెలలుగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు
తణుకు, డిసెంబరు 28 : జూనియర్ ఇంటర్ విద్యార్థులకు కళాశాలలో ప్రవేశాలు లేక ఆందో ళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు అని చెప్పి కాలయాపన చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు కళాశాలలు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ప్రైవేటు కళాశాలతో పాటు ప్రభుత్వ కళాశాల్లోనూ ప్రస్తుత విద్యాసంవత్సరంలో మాన్యు వల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కుదరదని కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు వచ్చి వారం రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకూ కళాశాలల్లో అడ్మిషన్లపై నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థులు తొమ్మిది నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 196 వరకూ ఉన్నాయి. వాటిలో సుమారుగా 30 వేల నుంచి 40 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. అయితే 9 నెలలు గడుస్తున్నప్పటికీ కేవలం ఆన్‌లైన్ పాఠాలకే ప్రభుత్వం పరిమితం చేసింది. అయితే ఆన్‌లైన్ పాఠాలు కూడా పూర్తిస్థాయిలో ఉపయోగపడిన దాఖలాలు లేవు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు.