కాలుష్య కాసారం

ABN , First Publish Date - 2020-12-12T05:20:39+05:30 IST

మండలంలోని పలు పంటబోదెలు, పంట కాల్వలు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర వ్యర్థపదార్థాలతో నిండిపోయి కాలుష్య కాసారాలుగా మారాయి.

కాలుష్య కాసారం
వీరమ్మకుంట పంటబోదెలో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు

పెదపాడు, డిసెంబరు 11 : మండలంలోని పలు పంటబోదెలు, పంట కాల్వలు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర వ్యర్థపదార్థాలతో నిండిపోయి కాలుష్య కాసారాలుగా మారాయి. ప్రజల తాగు, సాగునీటికై వినియోగించే పంట కా ల్వలు, పంటబోదెలు చెత్తా చెదారాలతో నిండిపోవడంతో తీవ్రమైన దుర్గం ధం వెద జల్లుతున్నాయి. అధికారులు ఈ పంటబోదెల ద్వారానే వచ్చిన నీటి తో మంచినీటి చెరువులను నింపుతున్నారు. చెరువుల్లోనే నింపిన నీటినే కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొంతమంది శుద్ధి చేసిన నీటిని కొనుగోలు చేసి వినియోగిస్తుండగా, మరికొంతమంది కుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీటినే వినియోగిస్తున్నారు. తీవ్రస్థాయిలో కలుషితంగా మా రిన నీటిని వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్యాలు బారినపడతా మేమో నని పలువురు ఆందోళన చెందుతున్నారు. మంచినీరు విడుదలయ్యే పంట బోదెలను ఆక్రమణల నుంచి, వ్యర్థాల బారినుంచి కాపాడాలని కోరుతు న్నారు. 

Updated Date - 2020-12-12T05:20:39+05:30 IST