-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari dpo
-
అనధికారిక లే అవుట్‌లపై సంక్రాంతి తర్వాత చర్యలు : డీపీవో రమేశ్
ABN , First Publish Date - 2020-12-19T05:43:59+05:30 IST
ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేని అనధికార లేఅవుట్‌లపై సంక్రాంతి తరువాత చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు.

పెనుమంట్ర, డిసెంబరు 18 : ప్రభుత్వ నిబంధనలకు లోబడి లేని అనధికార లేఅవుట్‌లపై సంక్రాంతి తరువాత చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయాలు ద్వారా ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పఽథకాలు అందుతున్నాయా లేదా, సేవలు ఎలా అందిస్తున్నా రనే అంశంపై మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్యం, మంచి నీటిసరఫరా, వీధి దీపాలు మెరుగు పరిచేందుకు గ్రామ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న నాడు – నేడు పనులను ఆయన పరిశీలించారు. ఎంపీడీవో ఆర్.విజయరాజు, వైసీపీ నాయ కులు పెన్మత్స విశ్వనాథరాజు, ఈవోపీఆర్‌డీ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.