త్వరితగతిన అట్రాసిటీ కేసుల దర్యాప్తు

ABN , First Publish Date - 2020-12-31T05:03:36+05:30 IST

ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నింది తులను అరెస్ట్‌ చేయాలని ఏలూ రు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు.

త్వరితగతిన అట్రాసిటీ కేసుల దర్యాప్తు
వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తున్న డీఐజీ

డీఐజీ కేవీ మోహనరావు 

ఏలూరు క్రైం, డిసెంబరు 30: ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నింది తులను అరెస్ట్‌ చేయాలని ఏలూ రు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న డీఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ నమోదైన కేసుల దర్యా ప్తును చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేసి ఛార్జి షీట్లను కోర్టులో దాఖలు చేయా లన్నారు. దర్యాప్తులో అలసత్వం వహించరాదని, కాల పరిమితిలోపే కేసుల దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-12-31T05:03:36+05:30 IST