-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari crime
-
ఆవిరైన ఆనందం...
ABN , First Publish Date - 2020-12-29T04:32:43+05:30 IST
బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి వస్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
కారును లారీ ఢీకొని ఒకరి మృతి
దేవరపల్లి, డిసెంబరు 28: బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లి వస్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన దంగేటి సత్యనారాయణ (57) ఏలూరులో ఆదివారం రాత్రి జరిగిన శుభకార్యానికి వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కారులో వెళ్లాడు.శుభకార్యం ముగిసిన తరువాత తెల్లవారు జామున కారులో రాజమహేంద్రవరం బయలుదేరారు. దేవరపల్లి మండలం ధుమ ంతునిగూడెం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారుని ఎరుదుగా వస్తున్న లారీ ఢీకొట్టి ంది. దీంతో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను అంబులెన్స్‌లో కొవ్వూరు ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్టు తెలిపారు. మరో ముగ్గురికి స్వల్పగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వెళ్లిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ స్వామి తెలిపారు.