-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari crime
-
ప్రమాదమా.. హత్యా!
ABN , First Publish Date - 2020-12-29T04:31:44+05:30 IST
అతిగా మద్యం సేవించి ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతిచెందాడు.

చెరువులో పడి అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
ఏలూరు క్రైం, డిసెంబరు 28 : అతిగా మద్యం సేవించి ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతిచెందాడు. విజయనగరానికి చెందిన బలివెల శ్రీని వాసరావు (30)కి భార్య కుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏలూరు రూరల్ మండలం కోటేశ్వరదుర్గాపురంలోని చేపల చెరువు వద్ద శ్రీనివాసరావు కుటుంబంతో వచ్చి కాపలా ఉంటున్నాడు. మూడు రోజులుగా అతిగా మద్యం తాగుతున్న శ్రీని వాసరావు ఆదివారం సాయంత్రం చెరువు గట్టు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. చెరువులో సోమవారం సాయంత్రం మృతదేహం తేలడంతో అతని భార్య కుమారి ఏలూరు రూరల్ పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఎస్‌ఐ సురేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.