అత్తారింటికి వెళ్లి తిరిగిరాలేదు!

ABN , First Publish Date - 2020-12-29T04:23:56+05:30 IST

అనుమానాస్పదస్థితిలో ఒక యువకుడు మృతిచెందాడు.

అత్తారింటికి వెళ్లి తిరిగిరాలేదు!
జడ్జి కామేశ్వరరావు

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి?

వీరవాసరం/పాలకోడేరు, డిసెంబరు 28 : అనుమానాస్పదస్థితిలో ఒక యువకుడు మృతిచెందాడు. వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన యువతితో తన కుమారుడు నరేంద్ర(26) వివాహం జరిగిందని.. ఇటీవల క్రిస్మస్‌ పండుగకు అత్తారింటికి వెళ్లి తిరిగి రాలేదని అత్తిలికి చెందిన మెరిపే బాలస్వామి వీరవాసరం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు.ఈ నెల 24వ తేదీన భార్య భర్తల మధ్య వివాదం తలెత్తి మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని కోడలు రెండు, మూడు సార్లు ఫోన్‌ చేసి తనకు సమాచారం ఇచ్చిందని  పేర్కొన్నాడు. వేండ్ర నుంచి శృంగవృక్షం మీదుగా వీరవాసరం వెళ్లే అండలూరు పంట కాలువలో వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పాలకోడేరు పోలీసులు మృతదేహం వద్దకు చేరుకుని కాలువలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి జేబులో డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌కార్డు ఆధారంగా నరేంద్రగా గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని అది నరేంద్ర మృతదేహాంగా గుర్తించారు. శవపంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వీరవాసరం ఎస్‌ఐ సీహెచ్‌ఎస్‌ రామచంద్రరావు తెలిపారు.

Updated Date - 2020-12-29T04:23:56+05:30 IST