చాతీ నొప్పితో లారీ డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2020-12-26T05:16:16+05:30 IST

చాతినొప్పితో లారీ డ్రైవర్‌ మృతిచెందాడు.

చాతీ నొప్పితో లారీ డ్రైవర్‌ మృతి

కొవ్వూరు,డిసెంబరు 25 : చాతినొప్పితో లారీ డ్రైవర్‌ మృతిచెందాడు. అనంతపురం జిల్లా వేములపాడు గ్రామానికి చెందిన మేనుగ రామాంజనేయులు(48) ఈ నెల 17వ తేదీన కర్ణాటకలోని బెల్గాం నుంచి కెమికల్‌ ఫౌడర్‌ లోడ్‌ వేసుకుని వైజాగ్‌ వచ్చాడు. మరలా వైజాగ్‌ నుంచి ఐరన్‌ లోడ్‌తో 24వ తేదీన బెల్గాం బయలుదేరాడు. కొవ్వూరు గామన్‌ బ్రిడ్జి టోల్‌గేట్‌ వద్దకు వచ్చేసరికి రామాంజనేయులు చాతీ నొప్పి వస్తుందని లారీ పక్కకు తీయగా మేనల్లుడు ఉల్లికంటి వెంకటేశ్‌  టోల్‌ప్లాజా అంబులెన్స్‌ సిబ్బందికి తెలియజేశారు. వారు పరీశీలించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. వెంకటేష్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Updated Date - 2020-12-26T05:16:16+05:30 IST