-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari cricket
-
నేడు దివ్యాంగుల క్రికెట్ ఫైనల్ పోటీ
ABN , First Publish Date - 2020-12-20T04:17:31+05:30 IST
దివ్యాంగుల క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్రీడాకారులు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు.

తణుకురూరల్, డిసెంబరు 19 : దివ్యాంగుల క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్రీడాకారులు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. తణుకు మండలం తేతలి ఏఎస్‌ఆర్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న నాల్గవ సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌లో రెండవ రోజు మొదటి మ్యాచ్‌లో పాండిచ్చేరిపై తమిళనాడు విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు సౌత్ 11 పై విజయం సాధించింది.మూడోమ్యాచ్‌లో తమిళనాడు కర్ణాటక జట్టుపై గెలిచింది. ఆదివారం తెలంగాణ, తమిళనాడు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని కార్యదర్శి యడ్లపల్లి సూర్యనారాయణ తెలిపారు.