18 నుంచి దివ్యాంగ టీ 20 క్రికెట్‌ పోటీలు

ABN , First Publish Date - 2020-12-16T04:27:06+05:30 IST

తణుకు స్టెప్పింగ్‌ స్టోన్‌ స్కూలు మైదానంలో 18 నుంచి సౌత్‌ జోన్‌ దివ్యాంగ టీ 20 క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్టు ఆంధ్ర క్రికెట్‌ ఫెడరేషన్‌ ఫర్‌ డిజేబుల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు.

18 నుంచి దివ్యాంగ టీ 20 క్రికెట్‌ పోటీలు

ఏలూరు స్పోర్ట్స్‌, డిసెంబరు 15 : తణుకు స్టెప్పింగ్‌ స్టోన్‌ స్కూలు మైదానంలో 18 నుంచి సౌత్‌ జోన్‌ దివ్యాంగ టీ 20 క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్టు ఆంధ్ర క్రికెట్‌ ఫెడరేషన్‌ ఫర్‌ డిజేబుల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకూ డాక్టర్‌ కారుమూరి ట్రోపీ నిర్వహిస్తున్నామన్నారు.ఏలూరులో పోటీలకు సంబంధించి వివరాలను వెల్లడి ంచారు. పోటీల్లో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణా, సౌత్‌ జోన్‌ టీమ్‌లు పాల్గొంటాయన్నారు. మూడు రోజులపాటు పోటీలు జరుగుతాయన్నారు. పోటీలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు.

Read more