నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-20T04:43:39+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు బి.బలరాం డిమాండ్‌ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి
ప్రకాశంచౌక్‌లో రిలే దీక్షలు చేస్తున్న రైతు సంఘం నాయకులు

భీమవరం అర్బన్‌, డిసెంబరు 19 : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు బి.బలరాం డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ పోరాటం చేస్తున్న రైతాంగానికి మద్దతుగా ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో శనివారం రిలే దీక్షలు ఆయన ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరంకుశపాలన కొసాగిస్తుందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా జిల్లావ్యాప్తంగా ప్రజాసంఘాల రిలే దీక్షలు, సంఘీభావ నిధి, రైతు జ్యోతి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, కలిదిండి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

Read more