-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari chirstamas
-
క్రీస్తు బోధనలు ఆచరణీయం : జేసీ
ABN , First Publish Date - 2020-12-20T04:12:52+05:30 IST
ఏసు క్రీస్తు బోధనలు ఆచరణీయమని జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి అన్నారు

ఏలూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఏసు క్రీస్తు బోధనలు ఆచరణీయమని జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్క రించుకుని శనివారం కలెక్టరేట్‌లో ప్రభుత్వం తరపున హైటీ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రేమ, దయ, సానుభూతి, జాలి మాత్రమే క్రీస్తు మతంలో ఉంటాయని అన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ క్రైస్తవతత్వం మంచిదని, అది అందరూ అలవరుచుకోవాలని అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. క్రిస్మస్ గీతాలు ఆహుతులను అలరించాయి.ఈ కార్యక్రమంలో జేసీ తేజ్ భరత్, ఆర్చ్ బిషప్ జాన్ ఎస్‌డీ రాజు, ఫాదర్ బాల, మైకేల్, అబ్రహం మాస్టారు, మైనార్టీ సంక్షేమ అధికారి పద్మావతి, మైనారిటీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, సిస్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.