తెలుగు మనసుల్లో చెరగని ముద్ర బాపు

ABN , First Publish Date - 2020-12-16T04:36:40+05:30 IST

తెలుగు ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రగా బాపు నిలుస్తారని పలువురు అన్నారు.

తెలుగు మనసుల్లో చెరగని ముద్ర బాపు
నరసాపురంలో బాపు విగ్రహం వద్ద నివాళి

నరసాపురం, డిసెంబరు 15:  తెలుగు ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రగా బాపు నిలుస్తారని పలువురు అన్నారు. దర్శకుడు బాపు జయంతిని మంగళ వారం ఘనంగా నిర్వహించారు. లలితాంబ రేవులోని బాపు విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మహనీయుడు బాపు అన్నారు. ముని సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రత్నమాల, శ్రీరాములు, శ్రీమన్నారాయణ, భూపతి నరేష్‌, అరేటి వేణు, చిటికెల రామ్మోహన్‌, పాపారావు, జగన్‌, బెజవాడ రమేష్‌, దానియేలు, నాగరాజు పాల్గొన్నారు.


పాలకొల్లు అర్బన్‌ : ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు సత్తిరాజు లక్ష్మీ నారాయణ (బాపు) జయంతి కార్యక్రమానికి వపా, బాపు ఆర్ట్‌ అకాడమి సభ్యులు నిర్వహించారు. బాపు చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. బాపు చిత్రాలు, పెయింటింగులు భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. సంఘ గౌరవ సలహాదారు గొన్నాబత్తుల సత్యనారాయణ, ఉపాధ్య క్షులు కొసనా భాస్కరరావు, చెల్లిబోయిన రాము, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌ కుమార్‌, కోశాధికారి కడలి శ్రీనివాస్‌, నీలం రవి, తమ్మా మధు, వాకలపూడి బాబ్జీ, కాసా కోటి వీరభద్రం, సోమాని శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:36:40+05:30 IST