రుణాలు సకాలంలో ఇవ్వాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-30T05:44:16+05:30 IST
అర్హులైన ప్రతి రైతుకు, కౌలుదా రులకు పంట రుణాలను సకాలంలో అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ ముత్యాలరాజు కోరారు.

ఏలూరు సిటీ, డిసెంబరు 29: అర్హులైన ప్రతి రైతుకు, కౌలుదా రులకు పంట రుణాలను సకాలంలో అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ ముత్యాలరాజు కోరారు. కలెక్టరేట్‌లో జరి గిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్‌లో కరోనా కష్టకా లం, లాక్‌డౌన్ సమయంలో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలలక్ష్యం రూ.6 వేల కోట్లకు రూ.5 వేల కోట్లు అందించి 84 శాతం లక్ష్యం సాధించడంపై కలెక్టర్ బ్యాంకర్లను అభినందించారు. రబీలో 4 వేల కోట్లు రుణ లక్ష్యం కాగా ఇప్పటికీ రూ.1786.95 కోట్లు రుణాలు అందించారని, మిగిలినవి త్వరితంగా అందించాలని కోరారు. ఎమ్మె ల్సీ సూర్యారావు, ఎల్‌డీఎం రామచంద్రరావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.