-
-
Home » Andhra Pradesh » West Godavari » west godavari award to kommugudem society
-
కొమ్ముగూడెం సొసైటీకి జాతీయ అవార్డు
ABN , First Publish Date - 2020-12-30T05:58:36+05:30 IST
రైతులకు సేవలందించడంలో తాడేపల్లిగూడెం మండలం కొమ్ము గూడెం విశాల పరపతి సంఘం దేశంలోనే మూడో స్థానంలో నిలిచినందుకు జాతీయ రాష్ట్ర సహకార బ్యాం కుల సమాఖ్య సుభాష్‌యాదవ్ అవార్డును ముంబైలో అందించారు.

తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 29 : రైతులకు సేవలందించడంలో తాడేపల్లిగూడెం మండలం కొమ్ము గూడెం విశాల పరపతి సంఘం దేశంలోనే మూడో స్థానంలో నిలిచినందుకు జాతీయ రాష్ట్ర సహకార బ్యాం కుల సమాఖ్య సుభాష్‌యాదవ్ అవార్డును ముంబైలో అందించారు. సొసైటీ చైర్‌పర్సన్ ఎస్.ఆదినారాయణ, సీఈవో సీహెచ్‌ఎస్‌వీ కృష్ణశర్మ అవార్డును మంగళవారం అందుకున్నారు. రైతులకు వీలైనన్ని రకాలుగా సేవలం దించినందుకు ఇది లభించినట్టు చైర్‌పర్సన్ ఆది నారాయణ చెప్పారు. ఈ అవార్డు స్ఫూర్తితో రైతులకు మరింత మెరుగైన సేవలందిస్తామని తెలిపారు.