పాలకుల నిర్లక్ష్యమే కారణం
ABN , First Publish Date - 2020-12-12T05:08:38+05:30 IST
ఏలూరు నగరంలో పారిశుధ్యం క్షీణించడంతో అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ఉపద్రవాలు సంభవిస్తు న్నాయి..
ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు
ఏలూరు క్రైం/ ఏలూరు కార్పొరేషన్, డిసెంబరు 11 : ‘ఏలూరు నగరంలో పారిశుధ్యం క్షీణించడంతో అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ఉపద్రవాలు సంభవిస్తు న్నాయి.. పారిశుధ్య లోపం నగరంలో స్పష్టంగా కనిపిస్తోంది.. కనీస అవసర మైన మంచినీటి సౌకర్యాల కల్పనలోనూ నిర్లక్ష్యం వహించడం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి’.. అంటూ ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పేర్కొన్నారు. ఏలూరు ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న బాధితులను ఆయన శుక్రవారం పరామర్శించారు. అలాగే వ్యాధికి గల కారణాలు, రోగులకు అంది స్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాధి ఎలా వచ్చిందో తక్షణం నిర్ధారణ చేయాల్సి ఉంద న్నారు. ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవా లని ప్రభుత్వానికి ఆయన సూచించారు. వ్యాధి బారిన పడినవారు చికిత్స అ నంతరం డిశ్చార్జి అయినా రెండు నెలలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక్కొక్క కుటుం బానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. నగరంలో శాని టేషన్ మెరుగుపరిచి శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయాలని కోరారు. కొన్నిచోట్ల బురద గుంటల్లోనే మంచినీటి కుళాయిలు ఉన్నాయని, వాటికి సరి చేయాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ ఏలూరు ఇన్‌చార్జ్ రాజనాల రామ్మోహన్‌రావు, కాంగ్రెస్ నాయకులు గౌడు రంగబాబు, లంకా రామ్మోహన్, దండుబోయిన చంద్రశేఖర్, ప్రతాప్ సుబ్రహ్మణ్య శర్మ, తాళ్ళూరి చక్రవర్తి, నల్లగట్ల మాణిక్యాలరావు, సేవాదళ్ సుబ్బారావు, సాదె బాబూ ప్రసాద్, కోసూరి చంద్రకాంతమ్మ, రాయల సతీశ్ ఉన్నారు.