రైతు చట్టాలతోనే మేలు

ABN , First Publish Date - 2020-12-28T06:00:52+05:30 IST

వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.ముర ళీధరన్‌ చెప్పారు.

రైతు చట్టాలతోనే మేలు
కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పిస్తున్న బీజేపీ నేతలు

 కేంద్ర మంత్రి మురళీధరన్‌

ఏలూరు టూ టౌన్‌, డిసెంబరు 27 :  వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.ముర ళీధరన్‌ చెప్పారు. ఆదివారం జరిగిన ప్రధానమంత్రి మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన ఏలూరులోని బీజేపీ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. అనంతరం సమస్యలపై పలువురు వినతిపత్రాలను కేంద్ర మంత్రికి సమర్పిం చారు. పోల వరం నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అందించకుండా, పునరావాస గ్రామాలు నిర్మించకుండా ప్రాజెక్టు పనులు చేపట్టరాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బురగం వెంకటలక్ష్మి కేంద్ర మంత్రి మురళీధరన్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రాజెక్టులో 41.5 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ ఉంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలా చేస్తే ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏడు మండలాలు ముంపునకు గురవుతాయన్నారు. అందుకే ముందుగా నిర్వా సితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వడం, పునరావాస గ్రామాలు నిర్మించిన తరువాతే పోలవరం పనులు కొనసాగించాలని కోరారు. ఏలూరులో వింత వ్యాధి ఘటనపై సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అత్యాధు నికమైన వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించేందుకు కృషిచేయాలని పలు వురు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు కొరళ్ళ జ్యోతిసుధాకరకృష్ణ, నర్సాపురం జిల్లా అధ్యక్షులు తాతాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్య నారా యణ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మ, మహిళా మోర్చ అధ్యక్షురాలు బి.నిర్మల కుమారి, కె.నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:00:52+05:30 IST