దారి తప్పి.. మృత్యు ఒడికి చేరాడు..

ABN , First Publish Date - 2020-12-28T04:46:28+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.

దారి తప్పి.. మృత్యు ఒడికి చేరాడు..

పెదపాడు, డిసెంబరు 27 : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. వీరవాసరం మండలం వీరవల్లిపాలెంకు చెందిన వీరవల్లి కృష్ణమూర్తి (63) మాదేపల్లి సమీపంలోని కాట్లంపూడి వద్ద జరిగే శుభకార్యానికి ఏపీ03 సీఎస్‌ 1492 నెంబరు గల స్కూటీపై వీరవల్లి పాండురంగారావుతో కలిసి బయలుదేరాడు. ఏలూరు వైపు రావాల్సిన వీరు కైకలూరు వద్ద దారి తప్పి గుడివాడ వెళ్లిపోయారు. గుడివాడ నుంచి వీరవల్లి–పెదపాడు మీదుగా ఏలూరు వస్తుండగా పెదపాడు శివారు అందేఖాన్‌ చెరువు వద్ద  ఎదురుగా వస్తున్న ఏపీ 16 ఎక్స్‌ 1917 నెంబరు గల టిప్పరు ఢీకొనడంతో కృష్ణమూర్తికి తలకు గాయమై అక్కడికక్కడే మృతిచెం దాడు. పాండురంగారావు గాయాలపాయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై జ్యోతిబస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతిచెందిన కృష్ణమూర్తికి ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు కాగా, కుమారుడు ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటున్నాడు. భార్య గుండె సంబం ధిత వ్యాధితో ఉండగా ఆమెకు ఇంటివద్ద అన్ని సపర్యలు చేస్తున్న కృష్ణమూర్తి ప్రమాదం బారినపడి మృతుఒడికి చేరడంతో కుటుంబసభ్యులను కలిచివేసింది.

Updated Date - 2020-12-28T04:46:28+05:30 IST