ఆవును హతమార్చిన పులి...భయాందోళనలో ప్రజలు

ABN , First Publish Date - 2020-12-30T15:57:31+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం లచ్చిగూడెం అడవిలో పులి సంచారం కలకలం రేపుతోంది.

ఆవును హతమార్చిన పులి...భయాందోళనలో ప్రజలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం లచ్చిగూడెం అడవిలో పులి సంచారం కలకలం రేపుతోంది.  గత రాత్రి లచ్చగూడెం గ్రామానికి చెందిన సున్నం వెంకయ్య ఆవును  పులి హతమార్చింది. దీనిపై అటవీశాఖ అధికారులకు గ్రామస్తుల సమాచారం అందించారు. పులి సంచారంతో ఏజెన్సీ గ్రామాల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే రెండు చిరుతల సంచారంతో గిరిజన గ్రామాల్లో అలజడి నెలకొనగా....ఇప్పుడు పులి సంచారంతో గిరిజన రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-12-30T15:57:31+05:30 IST