భీమవరంలో వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు
ABN , First Publish Date - 2020-12-20T14:36:24+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కోవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ షష్టి ఉత్సవాల్లో భక్తుల పాల్గొంటున్నారు. షష్టి వేడుకల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.