కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటికి పరీక్షలు

ABN , First Publish Date - 2020-12-10T17:38:57+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలోని కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటికి అధికారులు పరీక్షలు నిర్వహించా

కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటికి పరీక్షలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని కృష్ణా, గోదావరి కాల్వల్లో నీటికి అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధి నేపథ్యంలో కారణాలు గుర్తించేందుకు తాగునీటిపై అధికారుల దృష్టి సారించారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో 80 గ్రామాల్లో తాగునీటికి పరీక్షలు నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ఆధ్వర్యంలో తాగునీటికి పరీక్షలు చేపట్టారు. ఏలూరు సిటీ, రూరల్‌లో ఉన్న దెందులూరు, పెదపాడు మండలాల్లో కృష్ణా కాల్వ ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోంది. దెందులూరు మండలంలో కొన్ని గ్రామాలకు గోదావరి నీరు సరఫరా చేస్తున్నారు. 

Updated Date - 2020-12-10T17:38:57+05:30 IST