ఏలూరులో 341కి చేరిన వింత రోగం బాధితుల సంఖ్య
ABN , First Publish Date - 2020-12-07T15:12:36+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతరోగం బారిన పడిన బాధితుల సంఖ్య 341కి చేరింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతరోగం బారిన పడిన బాధితుల సంఖ్య 341కి చేరింది. ఇప్పటికే ఈ వ్యాధి నుంచి కోలుకుని 150 మంది డిశ్చార్జ్ అయ్యారు. తొమ్మిది మందిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. వింత వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు. ప్రైవేటు ఆసుపత్రులలో మరో 60 మందికి చికిత్స చేస్తున్నారు. నీటి నమూనాల కల్చర్ టెస్ట్ నివేదికలు నేడు వచ్చే అవకాశం ఉంది. వింత రోగానికి మాస్ హిస్టీరియా కారణమని సైక్రియాటిస్టులు చెబుతుండగా...న్యూరో టాక్జిన్స్ కారణం కావచ్చని ఎయిమ్స్ అధికారులు అంటున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీల నిపుణుల బృందాలు ఏలూరుకు రానున్నాయి. అలాగే మంగళగిరి ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం ఇక్కడకు రానుంది. అంతుచిక్కని వ్యాధికి వాయు కాలుష్యం కారణం కాదని కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ టెస్టింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కిరణ్ అంతుచిక్కని వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.