ఏలూరు: కార్తీక వనభోజనాల మాటున అశ్లీల నృత్యాలు
ABN , First Publish Date - 2020-12-05T14:53:11+05:30 IST
కార్తీక వనభోజనాల మాటున అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

ఏలూరు: కార్తీక వనభోజనాల మాటున అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లాలో దేవరపల్లి మండలం లక్ష్మీపురం శివారు తోటల్లో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. విషయం తెలిసిన చాగల్లు పోలీసులు తోటలో దాడి ఇద్దరు యువతులు, ఇద్దరు డ్యాన్సర్లు, ఒక నిర్వహకుడిని అరెస్ట్ చేశారు. కార్తీక వనభోజనాల మాటున అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశం దేవరపల్లి పోలీస్స్టేషన్ పరిధి కావడంతో కేసును దేవరపల్లి పోలీసులకు బదలాయించారు.