రేపటి వరకు వెబ్‌ ఆప్షన్‌కు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-12-17T06:40:27+05:30 IST

బదిలీ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు గడువును ఈనెల 18 వరకు పొడిగించారు.

రేపటి వరకు వెబ్‌ ఆప్షన్‌కు గడువు పొడిగింపు


ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 16 : బదిలీ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు గడువును ఈనెల 18 వరకు పొడిగించారు. వాస్తవానికి మంగళవారమే గడువు ముగియాల్సి ఉండగా, ఒక రోజు పొడిగించారు. తాజాగా మరో రెండు రోజులు గడువు ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 శాతం మంది ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వలేదు. సర్వర్‌ సమస్య వల్లే జాప్యానికి కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా తప్పనిసరి బదిలీ టీచర్లలో దాదాపు 25 శాతం మంది వెబ్‌ ఆప్షన్లు ఇవ్వకపోవడానికి సర్వర్‌ సమస్యే కారణమని తెలుస్తోంది. జిల్లాలో తప్పనిసరి, రిక్వెస్ట్‌ బదిలీల కోసం మొత్తం 5,706 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. 


Updated Date - 2020-12-17T06:40:27+05:30 IST