ప్రశాంత ఎన్నికలకు అందరి సహకారం కావాలి

ABN , First Publish Date - 2020-03-13T11:22:51+05:30 IST

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని స్థానిక సంస్థల

ప్రశాంత ఎన్నికలకు అందరి సహకారం కావాలి

స్థానిక ఎన్నికల పరిశీలకుడు హిమాన్షు శుక్లా


ఏలూరు సిటీ, మార్చి 12: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని స్థానిక సంస్థల ఎన్నికల పరి శీల కుడు హిమాన్షు శుక్లా అన్నారు. గురువారం ఏలూరు జడ్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జడ్పీ సీఈవో పులి శ్రీనివాసులు, డిప్యూటీ సీఈవో పరదేశి కుమార్‌లతో కలిసి పాల్గొన్నారు. హిమాన్షు శుక్లా మాట్లాడుతూ నెలాఖరువరకు జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉంటానని, ఉదయం 9.30 గంటల నుంచి 10.30 వరకు ఇరిగేషన్‌ అతిఽథి గృహం వద్ద, ఆ తరువాత 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జడ్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాన న్నారు.


స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంఽఽధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా గాని ఫోన్‌ ద్వారాగా గాని తెలియ జేయవచ్చునన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్ఫక్షపాతంగా నిర్వహించే క్రమంలో పత్రికా విలేకరుల సహకారం కూడా అవసరం అని అన్నారు. జడ్పీ సీఈవో పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు 2,876 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు.   

Updated Date - 2020-03-13T11:22:51+05:30 IST