‘చదవడం మాకిష్టం’తో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు
ABN , First Publish Date - 2020-11-27T05:05:45+05:30 IST
సెల్ఫోన్లు, ఇంటర్నెట్, వీడియోగేమ్స్, సోషల్ మీడియా ప్రభావంతో విలువైన భవిష్యత్తును నష్టపోతున్న విద్యార్థుల్లో సృజ నాత్మకతను పెంపొందించే దిశగా ‘చదవడం మాకిష్టం’ (వుయ్ లవ్ రీడింగ్) పేరిట విద్యాశాఖ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు.

ఎమ్మెల్సీ రాము సూర్యారావు
ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 26: సెల్ఫోన్లు, ఇంటర్నెట్, వీడియోగేమ్స్, సోషల్ మీడియా ప్రభావంతో విలువైన భవిష్యత్తును నష్టపోతున్న విద్యార్థుల్లో సృజ నాత్మకతను పెంపొందించే దిశగా ‘చదవడం మాకిష్టం’ (వుయ్ లవ్ రీడింగ్) పేరిట విద్యాశాఖ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం, వుయ్ లవ్ రీడింగ్ కార్య క్రమాలను గురువారం సుబ్బమ్మదేవి హైస్కూలులో నిర్వహించారు. ఎమ్మెల్సీ మా ట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అత్యున్నత రాజ్యాంగం భారత రాజ్యాంగమేనని, దీనిని తీర్చిదిద్దిన అంబేడ్కర్ ఆలోచనలను, ఆశయాలను నేటి విద్యార్థులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పఠనంతోనే విద్యార్థుల సామర్థ్యాలు పెరిగేందుకు అవ కాశం ఉంటుందన్నారు. డీఈవో సీవీ రేణుక మాట్లాడుతూ ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహిస్తామన్నారు. రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ రూపంలో విద్యార్థులతో చెప్పించారు. ‘చదవడం మాకిష్టం’ లోగోను, పోస్టర్ను, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏలూరు డీవైఈవో ఉదయ కుమార్, నగరపాలక సంస్థ డీవైఈవో కుటుంబరావు, సమగ్ర శిక్ష ఏఎంవో జాన్ ప్రభాకర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ప్రసన్న ఆంజనేయులు, నగర పాఠశాలల ఇన్స్పెక్టర్ సాంబశివరావు, ఎంఈవో ఎస్.నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.