30 వరకు కాల్వలకు..నీటి సరఫరా

ABN , First Publish Date - 2020-04-25T09:27:30+05:30 IST

తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు ఈ నెల 30వ తేదీ వరకు గోదావరి నీటిని సరఫరా చేయనున్నారు.

30 వరకు కాల్వలకు..నీటి సరఫరా

స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం

ఈ సీజన్‌లో 250.65 టీఎంసీల వినియోగం

3782.47 టీఎంసీల నీరు సముద్రంపాలు


నిడదవోలు, ఏప్రిల్‌ 24 : తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు ఈ నెల 30వ తేదీ వరకు గోదావరి నీటిని సరఫరా చేయనున్నారు. శివారు ప్రాంతాల్లో తాగునీటి చెరు వులను నింపుకునేందుకు కాల్వల నిలిపివేత గడువు మరో ఐదు రోజులు పొడిగించారు. ముందుగా శనివారం కాల్వ లను కట్టివేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. కానీ, ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎం.దక్షిణామూర్తి తెలిపారు. మంచినీటి అవసరాలు, చెరువులకు, చేపల చెరువులకు నీటి సమస్య ఉండదు. ఏప్రి ల్‌ చివర వరకు కాలువలకు నీరు సరఫరా చేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. మళ్లీ జూన్‌ 1 నుం చి 12వ తేదీలోపు కాలువలకు నీరు వదిలేస్తారు.


అలా వదలకపోతే ఖరీఫ్‌ సీజన్‌కు కష్టం. శుక్రవారం తూర్పు డెల్టాకు 1000 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లోస్‌ 6974 క్యూసెక్కులుగా ఉంది. గత నెలలో అడుగంటిన గోదావ రి ఇటీవల కొద్దిగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.75 అడుగులుగా ఉంది. గత ఏడాది జూన్‌ లో కాలువలను తెరిచినప్పటి నుంచి ఇప్పటివరకు కాలువల ద్వారా 250.65 టీఎంసీల నీటిని వినియోగించారు. సముద్రంలోకి 3782.47 టీఎంపీల నీటిని వదిలేశారు.  

Updated Date - 2020-04-25T09:27:30+05:30 IST