వాన కురిసే..

ABN , First Publish Date - 2020-06-22T11:20:49+05:30 IST

నైరుతి రుతుప వనాల ప్రభావం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయం త్రం భారీ వర్షం

వాన కురిసే..

కనిపించిన నైరుతి - జిల్లాలో అక్కడక్కడా వాన


ఏలూరుసిటీ/కాళ్ల/మొగల్తూరు/జీలుగుమిల్లి,జూన్‌ 21 : నైరుతి రుతుప వనాల ప్రభావం కారణంగా  జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది.మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. భీమవరం, మొగల్తూరు  మండలాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మొగల్తూరు మండలంలో ఆరు విద్యుత్‌ స్థంభాలు నేలకూలాయి. భీమవరం, కాళ్లలో గంటన్నర పాటు భారీగా వర్షం కురిసింది. విద్యుత్‌ సర ఫరాకు అంతరాయం ఏర్పడింది.


జీలుగుమిల్లి,నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, యలమంచిలి,పోడూరు, ఆచంట, చింతలపూడి పెదవేగి, పెదపాడు,   మండ లాల్లో స్వల్పంగా వర్షపాతం నమోదైంది.కాళ్ల మండలంలో ఆదివారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి.  పల్లపు ప్రాంతాలన్నీ కాల్వలను తలపించాయి. కాళ్ల, కాళ్ళకూరు, ఏలూరుపాడు, జువ్వలపాలెం, సీసలి, దొడ్డనపూడి తదితర గ్రామాల్లో రోడ్లు నీటితో నిండిపోయాయి.మొగల్తూరు సబ్‌ స్టేషన్‌ సమీపంలోని ఆరు విద్యుత్‌ స్థంభాలు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఉదయం 10.30 గంటలకు సరఫరా నిలిచిపోగా మరమ్మతుల అనంతరం రాత్రి 10 గంటల సమయంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధ్దరించారు. 

Updated Date - 2020-06-22T11:20:49+05:30 IST