రెవెన్యూ అధికారులపై విస్సాకోడేరు వాసుల ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-06T05:32:29+05:30 IST

విస్సాకోడేరులో బీసీ, ఎస్సీల కు చెందిన 75 సెంట్ల స్థలం కోర్టులో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా లా క్కునేందుకు ప్రయత్నించడా న్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం రాత్రి గ్రామస్థులు నిరసన తెలిపారు

రెవెన్యూ అధికారులపై విస్సాకోడేరు వాసుల ఫిర్యాదు

పాలకోడేరు, డిసెంబరు 5 : విస్సాకోడేరులో బీసీ, ఎస్సీల కు చెందిన 75 సెంట్ల స్థలం కోర్టులో ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా లా క్కునేందుకు ప్రయత్నించడా న్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం రాత్రి గ్రామస్థులు నిరసన తెలిపారు. అనంతరం రెవె న్యూ సిబ్బందిపై ఎస్‌ఐ ఏజీ ఎస్‌ మూర్తికి శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడు తూ విస్సాకోడేరు గాంధీ పేటలో స్థానికులు సామాజిక అవసరాలు తీర్చుకునేందు కు స్థలాన్ని ఉపయోగించుకుంటున్నామన్నారు. 2007లో భూసేకరణ కింద ఆ స్థలాన్ని ప్రభుత్వం తమదేనంటూ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చిందన్నారు. మళ్లీ అదే స్థలాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ప్రయత్నించడమే కాకుండా ఆ స్థలంలో వున్న షెడ్డును, అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించేందుకు గ్రామ రెవెన్యూ సిబ్బంది దౌర్జన్యంగా స్థలంలోకి ప్రవేశించారన్నారు. కోర్టు స్టేలో ఉన్నప్పటికీ స్థలంలోకి ప్రవేశించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతున్నామన్నారు. గ్రామ స్థులు వెంకటరావు, దుండి అశోక్‌, నడిపూడి అప్పారావు, సురేశ్‌, శ్రీను ఉన్నారు. 

Updated Date - 2020-12-06T05:32:29+05:30 IST