మంత్రులకు సమస్యల స్వాగతం

ABN , First Publish Date - 2020-11-19T06:10:24+05:30 IST

నేడు చింతలపూడి వస్తున్న మంత్రులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

మంత్రులకు సమస్యల స్వాగతం
గోతులతో అధ్వానంగా ఏలూరు–చింతలపూడి రోడ్డు (ఫైల్‌)

రోడ్లు మరమ్మతులకు వినతి
రవాణా సౌకర్యాలు పెంచాలని  ప్రజల  వేడుకోలు

చింతలపూడి, నవంబరు 18: నేడు చింతలపూడి వస్తున్న మంత్రులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మండలంలో రోడ్లు దెబ్బతిని  ఇబ్బం దులు  ఎదుర్కొంటున్నామని,  ప్రధానంగా ఏలూరు–చింతలపూడి, ద్వారకా తిరుమల–చింతలపూడి మార్గాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రయాణిం చాలంటే నరకం చూస్తున్నామని గ్రామస్థులు చెప్తున్నారు. వీటి మరమ్మతులకు  మంత్రులు చర్యలు తీసుకోవాలని   కోరుతున్నారు.

దూర ప్రాంతాలకు బస్సులేవీ?
ఈ ప్రాంతంలో నడిపే ఆర్టీసీ సర్వీసులు కండిషన్‌లో లేనివి నడుపుతున్నారని, దూర ప్రాంతాలకు సర్వీసులు నిర్వహించడం లేదని, రాష్ట్ర సరిహద్దులో ఈ మండలం ఉన్నందున అటు తెలంగాణ  నుంచి కానీ, ఇటు ఆంధ్రా ప్రాంతం నుంచి కాని దూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీసులు లేక గత 25 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. దూర ప్రాంతాలకు  వెళ్లాలంటే ఏలూరు లేదా తెలంగాణా ప్రాంతం సత్తుపల్లి వెళ్లి ప్రయాణించాల్సి వస్తోందని, దీంతో వ్యయ ప్రయాసలకు గురవుతున్నామని వాపోయారు. నగర పంచాయతీ స్థాయికి ఎదిగినప్పటికీ కనీసం విజయవాడకు ఇప్పటి వరకూ నేరుగా బస్సు సర్వీసు వేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2020-11-19T06:10:24+05:30 IST