తణుకు రేషన్‌ షాపులో విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2020-06-19T10:29:10+05:30 IST

పట్టణంలో డీలర్‌ పెరవలి లక్ష్మికి చెందిన 5వ నెంబర్‌ రేషన్‌ షాపులో విజిలెన్స్‌ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

తణుకు రేషన్‌ షాపులో విజిలెన్స్‌ తనిఖీలు

తణుకు, జూన్‌ 18 : పట్టణంలో డీలర్‌ పెరవలి లక్ష్మికి చెందిన 5వ నెంబర్‌ రేషన్‌ షాపులో విజిలెన్స్‌ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్‌ ఎస్‌ఐ కె.ఏసుబాబు, ఎఫ్‌ఆర్‌వో వరప్రసాద్‌ షాపులో ఉన్న బియ్యం, పంచదార, కందిపప్పు, శనగలు, ఈ-పోస్‌ మిషన్‌లో ఉన్న వాటికి ఆర్‌వోలో ఉన్న వాటికి వ్యత్యాసాలను పరిశీలించారు. అన్ని సరుకులు ఆర్‌వో ప్రకారం ఉన్నాయని, ఈపోస్‌ మిషన్‌లో మాత్రం నిల్‌ చూపిస్తోందని, మిషన్‌ సక్రమంగా పని చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయం జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసు కెళ్లామన్నారు. డిప్యూటీ డీటీ వరప్రసాద్‌, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొనారు.  

Updated Date - 2020-06-19T10:29:10+05:30 IST