బిల్డింగ్‌ మెటీరియల్‌ దుకాణాలపై విజిలెన్స్‌ దాడి

ABN , First Publish Date - 2020-02-12T12:01:02+05:30 IST

జిల్లా కేంద్రం ఏలూరు పరిసర ప్రాంతాల్లో పలు బిల్డింగ్‌ మెటీరియల్‌ దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు మంగళవారం

బిల్డింగ్‌ మెటీరియల్‌ దుకాణాలపై విజిలెన్స్‌ దాడి

ఏలూరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం ఏలూరు పరిసర ప్రాంతాల్లో పలు బిల్డింగ్‌ మెటీరియల్‌ దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన కంకర, మెటల్‌ చిప్స్‌, మట్టి, ఇసుక నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నారని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. కండ్రికగూడెం, మోతేవారి తోట, చంద్రగుప్త కాలనీ, పుష్పలీలానగర్‌లో 4 దుకాణాలలో అవకతవకలున్నట్లు అధికారులు నిర్ధారించారు.


ప్రభుకృప బిల్డింగ్‌ మెటీరియల్స్‌, శ్రీసాయిదేవి సప్లయర్స్‌, అనంత లక్ష్మి స్టీల్స్‌, సిమెంటు, ఏసు కృప ఏజెన్సీస్‌, బిల్డింగు మెటీరియల్స్‌ తనిఖీచేసి బిల్లులు లేకుండా విక్రయిస్తున్నవారిపై కేసులు నమోదు చేశారు. చట్టపరమైన చర్యల నిమిత్తం గనులు భూగర్భ శాఖ సహాయ సంచాలకులకు అందించారు. తనిఖీల్లో 44 క్యూబిక్‌ మీటర్ల ఇసుక, 207 క్యూబిక్‌ మీటర్ల రోడ్డు చిప్స్‌, 26,200 ఇటుకలు సీజ్‌ చేశారు. తనిఖీల్లో విజిలెన్స్‌ సీఐ జీవీవీ.నాగేశ్వరరావు, జి.జయప్రసాద్‌, పి.రవికుమార్‌, కె.ఏసుబాబు, మైనింగ్‌ అధికారులు ఏ.శ్రీనివాస ప్రసాద్‌, రెవెన్యూ అధికారులు ఉన్నారు. 

Updated Date - 2020-02-12T12:01:02+05:30 IST