రహదారే.. డ్రెయినేజీ..!

ABN , First Publish Date - 2020-11-08T05:08:13+05:30 IST

వీరవాసరంలో జాతీయ రహదారి మార్జిన్‌ డ్రెయినేజిగా మారిపోయింది.

రహదారే.. డ్రెయినేజీ..!

వీరవాసరం, నవంబర్‌ 7: వీరవాసరంలో జాతీయ రహదారి మార్జిన్‌ డ్రెయినేజిగా మారిపోయింది. వర్షపు నీరు రహదారి మార్జిన్‌లో నిలిచిపోవడం సాధారణం. కానీ ఇక్కడ మురుగునీరు రహదారి పక్కనే ప్రవహిస్తోంది. గ్రామంలో డ్రెయినేజీ సదుపాయం లేకపోవడంతో గ్రామస్థుల వాడకం నీరు ఇలా రహదారిపై చేరుతోంది. ముఖ్యంగా గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి పశ్చిమకాలువ వరకూ రహదారిని చేర్చి ఉండే డ్రయినేజీ పూడికపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. వాహనాలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి కావడంతో మురుగు పారుదల నియంత్రణపై పంచాయతీ అధికారులు కూడా దృష్టి సారించడం లేదు.

Updated Date - 2020-11-08T05:08:13+05:30 IST