విత్తన.. వర్రీ!

ABN , First Publish Date - 2020-11-22T05:16:49+05:30 IST

దాళ్వా విత్తనాలకు గిరాకీ ఏర్పడింది.

విత్తన.. వర్రీ!
1153 రకం విత్తన పంట

సార్వాలో తగ్గిన దిగుబడి 

దాళ్వా విత్తనానికి గిరాకీ

75 కేజీల బస్తా రూ.2550 

 రైతుల ఆందోళన

భీమవరం రూరల్‌, నవంబరు 21: దాళ్వా విత్తనాలకు గిరాకీ ఏర్పడింది. ఉల్లి ధర మండిన ట్లుగా దాళ్వా సాగు విత్తనం ధర భారీగా పెరిగింది. సార్వా సాగు తక్కువ కావడం విత్తనం ధర పెరిగేలా చేసింది. దీంతో 75 కేజీల దాళ్వా విత్తనా లు ఏకంగా రూ.2550 ధరగా రైతులు నిర్ణయిం చారు. అయినా రైతులు కొనుగోలుకు ముం దుకు వెళుతున్నారు. కిరాయిలతో కలిపి 75 కేజీల బస్తా విత్తనాలు రూ. 2700 వరకు అవుతుందని రైతులు అంటున్నారు. గతేడాది బస్తా విత్తనాలు రూ.1800 నుంచి 2000 వరకు ధర ఉండేది. ఇప్పుడు రూ.2700 వరకు విత్తన ధర ఉండడంతో రైతులపై ఈ ఏడాది రూ.900 వరకు అదనపు భారం పడుతు ంది. ముందస్తు జాగ్రత్తగా విత్తనాలు భద్రపర్చుకునే ప్రయత్నంలో రైతులు నిమగ్న మయ్యారు. సార్వాలో నష్టాలు చవిచూసిన రైతులు అధిక ధర పెట్టి విత్తనాలు కొను గోలు చేయడం భారంగా మారిందని చెబుతున్నారు. 


84 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం..

జిల్లాలో వచ్చే దాళ్వా లక్షా 69 వేల హెక్టార్లలో సాగు చేయనున్నట్టు వ్యవసాయాధికా రులు చెబుతున్నారు. ఈ లెక్కన 84 వేల క్వింటాళ్ల విత్తనాలు దాళ్వా సాగుకు అవసరం. ఈ సార్వా సాగులో 1600 హెక్టార్లలో విత్తన సాగు చేసినట్టు అధికారులు లెక్క. అయితే ఈ ఏడాది ఎడతెరపి లేని వర్షాల కారణంగా దిగుబడి భారీగా పడిపోయి ందని రైతులు చెబు తున్నారు. ఈ లెక్కన గతేడాది కంటే రైతు విత్తనం 30 నుంచి 40 శాతం తక్కవ దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. దీంతో వ్యవసాయశాఖ అందించే విత్తనా లపై కూడా రైతులు ఈసారి ఆధారపడాల్సి వస్తోంది. దాళ్వాలో 1121 రకం వరి వంగడం 60 శాతంపైనే సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులకు కూడా ఆ విత్తనం పైనే మక్కువ ఉంది. అధిక వర్షాల కారణంగా 1121 రకానికి అణుగాయ రావడం విత్తనం ఉపయోగించలేని పరిస్థితి కొన్ని చోట్ల ఏర్పడింది.దీంతో ఆ విత్తన కొరత ఎక్కువ కనిపిస్తుంది. మిగిలిన 1053, 1056, 1153, బొండాలు విత్తనాలు కూడా గిరాకీ ఉండడంతో అధిక ధరల్లోనే కొను గోలు చేస్తున్నారు. ఏపీ సీడ్‌ ద్వారా 9 వేల క్వింటాళ్ల వరకు రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వ్యవసాయశాఖ జేడీ గౌషియా బేగం తెలిపారు. 


విత్తనాలు అందుబాటులో లేవు : పి.రాంబాబు, రైతు

విత్తనాలు అందు బాటులో లేవు. దూర ప్రాంతాలకు వెళ్లి బస్తా రూ.2500 పెట్టి కొను గోలు చేయాల్సి వస్తుంది. సాగు ఆదిలోనే రైతులకు విత్తన పెట్టుబడి భారం పడింది.


ఏపీ సీడ్‌ ద్వారా విత్తనాలు అందిస్తాం : గౌసియా బేగం, జేడీ

ఏపీ సీడ్‌ ద్వారా రైతులకు విత్తనాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. 1121 రకం ఎక్కువ ఉపయోగిస్తారు. కావాల్సిన రకాలు కూడా అందుబాటులో ఉం టాయి. రైతు విత్తనం ఎక్కువ శాతం ఉపయోగించుకుంటారు. వారికి ఇంకా అవసర మైనవి ఏపీ సీడ్‌ ద్వారా వచ్చిన విత్తనాలు అందించడం జరుగుతుంది. 

Read more