కళ తప్పిన శ్రావణం

ABN , First Publish Date - 2020-08-01T11:01:45+05:30 IST

వరలక్ష్మి వ్రతం మహిళలకు పెద్ద పండగ. వరలక్ష్మి అమ్మవారికి పూజలు చేసుకుని ఎడమచేతికి తోరం కట్టుకుని సాయంత్రం అమ్మవార్లను ..

కళ తప్పిన శ్రావణం

ఆన్‌లైన్‌లో అమ్మవారి మహత్యం చూశారు

మొబైల్‌లో పురోహితులు పూజ చేయించారు

ఇళ్లలో వ్రతమాచరించిన మహిళలు

గుడి బయట నుంచే అమ్మవారికి దండం


వరలక్ష్మి వ్రతం మహిళలకు పెద్ద పండగ. వరలక్ష్మి అమ్మవారికి పూజలు చేసుకుని ఎడమచేతికి తోరం కట్టుకుని సాయంత్రం అమ్మవార్లను దర్శించుకునేవారు. కరోనా ప్రభావంతో పరిస్థితి మారిపోయింది. ఇళ్లలో పురోహితులు నిర్వహించే పూజలు ఆన్‌లైన్‌, మొబైల్‌ ద్వారా జరిగాయి. ఇంటర్నెట్‌, ఫోన్‌లో వ్రత మహత్యం వింటూ, చూస్తూ పూజలు చేసుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదని మహిళలు వాపోతున్నారు.


కొత్త కోడలు అత్తవారింట వరలక్ష్మి వ్రతం చేయడం ఆచారం. ప్రస్తుతం బంధువుల హడావుడి లేకండా పూజ అయిందనిపించారు. ఆలయాల్లో కూడా అమ్మవార్ల దర్శనాలు లేకపోవడంతో బయట నుంచే దండాలు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల పరిమిత సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

-ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

Updated Date - 2020-08-01T11:01:45+05:30 IST