పాత్రికేయుల వనసమారాధన
ABN , First Publish Date - 2020-12-07T05:44:01+05:30 IST
కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ కార్తీక వన భోజనాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు దూసనపూడి సోమసుందర్ తెలిపారు.

తాడేపల్లిగూడెం రూరల్, డిసెంబరు 6 : కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ కార్తీక వన భోజనాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు దూసనపూడి సోమసుందర్ తెలిపారు. తాడేపల్లి గూడెం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సీతారామయ్య తోటలో జర్నలిస్టులు కుటుంబాలతో వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆట పాటలతో పిల్లలు, మహిళలు, జర్నలిస్టులు ఆహ్లాదంగా గడిపారు. ఇటీవల ఏలూరు డీపీఆర్‌వో కార్యాలయంలో విజువల్ ఆపరేటర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన టి.నాగేశ్వరరావు దంపతులను సత్కరించారు. ఆట పాటల విజేతలకు బహుమతులు అందించారు. కాంగ్రెస్ పార్టీ నరసాపురం అధ్యక్షుడు మార్నీడి బాబ్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వానపల్లి సుబ్బారావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చిక్కాల రామకృష్ణ, మైలవరపు రవికిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు గజపతి వరప్రసాద్, కార్యదర్శి యడ్లపల్లి శ్రీనివాస్, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు కె.ఆశీర్వాదరావు, పి.మురళీ, కార్యదర్శి పుండరికాక్షుడు, మాజీ అధ్యక్షుడు యడ్లపల్లి మురళీ, చిట్యాల రాంబాబు పాల్గొన్నారు.