ఘనంగా వాల్మీకి జయంతి

ABN , First Publish Date - 2020-11-01T05:07:09+05:30 IST

నేడు కుటుంబాల్లో బంధాలు ఎలా ఉండాలో, పాలకులు ధర్మ మార్గంలో ప్రజల్ని ఎలా పాలించాలో తెలిపే రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి చిరస్మరణీయుడని వంకావారి గూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రం హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం అన్నారు.

ఘనంగా వాల్మీకి జయంతి

జీలుగుమిల్లి, అక్టోబరు 31:  నేడు కుటుంబాల్లో బంధాలు ఎలా ఉండాలో, పాలకులు ధర్మ మార్గంలో ప్రజల్ని ఎలా పాలించాలో తెలిపే  రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి చిరస్మరణీయుడని వంకావారి గూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రం హెచ్‌ఎం సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం వాల్మీకి జయంతిని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Read more