ఉపాధి కూలీల సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తా : పీడీ

ABN , First Publish Date - 2020-11-20T04:58:38+05:30 IST

ఉపాధి హామీ కూలీల సమస్యలు, వారి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామని డ్వామా పీడీ డి.రాంబాబు అన్నారు.

ఉపాధి కూలీల సమస్యలు ప్రభుత్వానికి నివేదిస్తా : పీడీ
సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ రాంబాబు

ఏలూరుకార్పొరేషన్‌, నవంబరు 19 : ఉపాధి హామీ కూలీల సమస్యలు, వారి డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామని డ్వామా పీడీ డి.రాంబాబు అన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో  ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన రాష్ట్ర సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఏడాదికి ఉపాధి కూలీలకు 200 రోజులు పనిదినాలు కల్పించేందుకు, సరైన వేతనం అందించేందుకు కృషి చేస్తా మని చెప్పారు. ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, ఐ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి కూలీల సమస్యలపై శాసన మండలిలో చర్చిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ మాట్లాడుతూ కరోనా నేప థ్యంలో కేంద్రం పేద కుటుంబాలకు నెలకు రూ.10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడల సుబ్బారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పిల్లి రామకృష్ణ, ఎ.రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.నాగరాజు, కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సీఐటీ యూ నాయకులు బి.సోమయ్య, చింతకాయల బాబూరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T04:58:38+05:30 IST