కార్యకర్తలకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2020-12-08T04:20:13+05:30 IST

నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా
ఎమ్మెల్యే మంతెన రామరాజును సత్కరిస్తున్న టీడీపీ నేతలు

ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు


ఉండి, డిశంబరు 7: నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. టీడీపీ మండల సమావేశం సోమవారం నిర్వహించా రు. అసెంబ్లీలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే రామరాజును సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. రైతుల సమస్యలతోపాటు రహదారులు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు జుత్తుగ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్సి మోపిదేవి శ్రీనివాస రావు, కన్నెగంటి రూత్‌కళ, వత్సవాయి సుజాత, యశోధకృష్ణ, కరిమెరక నాగరాజు, కాగిత మహంకాళి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T04:20:13+05:30 IST