-
-
Home » Andhra Pradesh » West Godavari » Tuffan Effect
-
నివర్ దడ !
ABN , First Publish Date - 2020-11-26T05:00:57+05:30 IST
నివర్ తుఫాన్ రైతుల్లో దడ పుట్టిస్తుంది. వారం రోజులుగా ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. కళ్లాల్లోనే ధాన్యం నిల్వల పై బరకాలు కప్పి ఉంచారు.

హడావుడిగా వరికోతలు
పొగాకు నాట్లు పడి నెల లోపే..
ఈలోపు వర్షం పడితే అంతే సంగతులు
గతేడాది ఇదే సమయంలో తుఫాన్
పొగాకు, వరి రైతుల్లో ఆందోళన
జంగారెడ్డిగూడెం/జీలుగుమిల్లి, నవంబరు 25 : నివర్ తుఫాన్ రైతుల్లో దడ పుట్టిస్తుంది. వారం రోజులుగా ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. కళ్లాల్లోనే ధాన్యం నిల్వల పై బరకాలు కప్పి ఉంచారు. వరి కోతలను మి షన్ల ద్వారా కోస్తున్నారు. వర్జీనియా పొగాకు రైతు లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గడిచిన సీజన్‌లో లక్షల రూపాయల నష్టం రావడంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేశారు. ఇక కొంతమంది రైతులు నెల రోజుల లోపే పొగాకు నాట్లు వేశారు. పొగాకు నారు నాటిన మూడో రోజున తడి పెడతారు ఆ తరువాత నెలరోజుల పాటు మొక్క ఎదుగుదల కు మందులు పిచికారీ చేస్తారు. ఇక నెల రోజుల తరువాత ఆ మొక్కకు తడి పెడతారు. ఈ దశ లో వర్షాలు పడితే మొక్కల ఎదుగుదల ఆగిపో యి కుళ్లిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా ఇదే సమయంలో తుఫాన్ రావడం వల్ల ఆ సీజన్‌లో ఎక్కువ శాతం లోగ్రేడ్ పొగాకు పండి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. భారీ వర్షాలు నమోదయితే పొ గాకు రైతులకు మరోసారి గట్టిదెబ్బ తగిలినట్టేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.