ట్రక్కు వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-22T05:03:41+05:30 IST

వలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయడానికి అవసరమైన ట్రక్కు వాహనాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కార్యదర్శులను ఎంపీడీవో రాజశేఖర్‌ ఆదేశించారు

ట్రక్కు వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

తాళ్లపూడి, నవంబరు 21 : వలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయడానికి అవసరమైన ట్రక్కు వాహనాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కార్యదర్శులను ఎంపీడీవో రాజశేఖర్‌ ఆదేశించారు మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యదర్శులు, డిజిటల్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్‌ సప్లయిస్‌ ఆధ్వర్యంలో సబ్సిడీపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ట్రక్కు వాహనాలు అందజేస్తామన్నారు.  ఈనెల 27 లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 

Read more