ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష 5వ తేదీకి వాయిదా

ABN , First Publish Date - 2020-11-28T04:50:34+05:30 IST

ట్రిపుల్‌ ఐటీలలో అడ్మిషన్లకు ఈ నెల 28న జరగాల్సి ఉన్న ప్రవేశ పరీక్షను నివర్‌ తుఫాన్‌ కారణంగా డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసినట్టు డీఈవో సీవీ రేణుక శుక్రవారం తెలిపారు.

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష 5వ తేదీకి వాయిదా

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 27 : ట్రిపుల్‌ ఐటీలలో అడ్మిషన్లకు ఈ నెల 28న జరగాల్సి ఉన్న ప్రవేశ పరీక్షను నివర్‌ తుఫాన్‌ కారణంగా డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసినట్టు డీఈవో సీవీ రేణుక శుక్రవారం తెలిపారు. వాయిదాపడిన పరీక్ష డిసెంబరు 5న ఉదయం 11 నుంచి 1 గంట వరకూ జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మార్పులేదని పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు పత్రంతో రెండు గంటలు ముందుగా నిర్ణీత పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read more