లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

ABN , First Publish Date - 2020-09-17T05:30:00+05:30 IST

జాతీయ రహ దారిపై వెల్లమిల్లి రేవు వద్ద బుధవారం అర్ధ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సహాయ డ్రైవర్‌ కార్తీక్‌ దూలే (44)

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

 సహాయ డ్రైవర్‌ మృతి.. 8 మందికి గాయాలు


ఉంగుటూరు, సెప్టెం బర్‌ 17: జాతీయ రహ దారిపై వెల్లమిల్లి రేవు వద్ద బుధవారం అర్ధ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సహాయ డ్రైవర్‌ కార్తీక్‌ దూలే (44) మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. కోల్‌కతా నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బాదం పూడి వై.జంక్షన్‌ దాటి వెల్లమిల్లి రేవు తర్వాత ముందు వెళుతున్న మొక్కజొన్న లోడు లారీని ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో తలుపు వద్ద వున్న సహాయ డ్రైవర్‌ కార్తీక్‌ ఎగిరి బస్సు టైరు కిందపడి మృతి చెందా డు. బస్సులో ప్రయాణిస్తున్న 49 మందిలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.


బస్సు డ్రైవర్‌ పరారీలో వున్నాడు. డ్రైవర్‌ మద్యం మత్తులో వున్నట్లు వలస కూలీ లు చెబుతున్నారు. కోల్‌కతా టైల్స్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వలస కూలీలు స్వస్థలం బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు. మృతదేహాన్ని ఏలూ రు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2020-09-17T05:30:00+05:30 IST