-
-
Home » Andhra Pradesh » West Godavari » TNK NEWS
-
కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం
ABN , First Publish Date - 2020-10-31T10:25:27+05:30 IST
కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు పిలుపు నిచ్చారు.

ఏఐటీయూసీ శత వార్షికోత్సవాల్లో కార్మికుల ప్రతిన
తణుకు టౌన్, అక్టోబరు 30 : కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణకు ఉద్యమించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోనాల భీమారావు పిలుపు నిచ్చారు. ఏఐటీయూసీ శత వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం తణు కులో బైక్ ర్యాలీ చేశారు. కార్మిక చట్టాలను కేంద్రంలో మోదీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు సైతం లేకు ండా కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లా కమిటీ సభ్యుడు బొద్దాని నాగరాజు కార్మిక వర్గం సంఘటిత పోరాటాల ద్వారా హక్కులను పరిరక్షించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కరెళ్ళ సాయినాఽథ్, దేవ పెద్దిరాజు, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.