నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-31T10:21:03+05:30 IST

వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అత్తిలి, అక్టోబరు 30 : వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. తిరుపతిపురంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిపురం, బల్లిపాడు గ్రామాల్లో 200 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందన్నారు. కనీసం ఎన్యుమరేషన్‌ చేయించడానికి అధికారులను సమన్వయం కూడా చేయలేదన్నారు. ప్రభుత్వం మాయమాటలతో మభ్యపెట్టడం తప్ప రైతులకు చేసిందేమిలేదన్నారు. పశువులకు గడ్డి లేక ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బా చంటి, గంటా వెంకటేశ్వర్లు, పంపన వెంకట్రావు, పూతినీడి శ్రీనివాస్‌, కొరిపల్లి ప్రసాద్‌, ముత్యాల నాగేశ్వరరావు, గారపాటి బాబ్జి, అడ్డాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Read more