-
-
Home » Andhra Pradesh » West Godavari » TNK NEWS
-
మాజీ మంత్రి మాణిక్యాలరావుకు నివాళి
ABN , First Publish Date - 2020-10-31T10:19:16+05:30 IST
ప్రతీ ఒక్కరూ విద్యావంతులు కావాలనే మాజీ మంత్రి మాణిక్యాల రావు ఆశయ సాధనకు పాటుపడతా మని గట్టి సింధు పేర్కొన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 30 : ప్రతీ ఒక్కరూ విద్యావంతులు కావాలనే మాజీ మంత్రి మాణిక్యాల రావు ఆశయ సాధనకు పాటుపడతా మని గట్టి సింధు పేర్కొన్నారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతిని పురస్కరించుకుని శుక్ర వారం ఆయన చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు.అనంతరం మారిశెట్టి నరసింహమూర్తి ఆధ్వర్యంలో హౌసింగ్‌బోర్డు కాలనీ నేతాజీ మునిసిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందించారు.కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ, గట్టిం మాణిక్యాలరావు,గట్టిం నవీన్, నరిసే సోమేశ్వరరావు,కోట రాంబాబు పాల్గొన్నారు.