-
-
Home » Andhra Pradesh » West Godavari » TNK NEWS
-
శశికి ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లు : రవికుమార్
ABN , First Publish Date - 2020-10-31T10:16:26+05:30 IST
శశి విద్యాసంస్థ ఏటా నీట్ ర్యాంకులు సాధిస్తోందని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగు పల్లి రవికుమార్ పేర్కొన్నారు.

ఉండ్రాజవరం, అక్టోబరు 30 : శశి విద్యాసంస్థ ఏటా నీట్ ర్యాంకులు సాధిస్తోందని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగు పల్లి రవికుమార్ పేర్కొన్నారు.వేలివెన్ను శశి ప్రాంగణంలో శుక్రవారం నీట్-2020 కౌన్సెలింగ్, అడ్మిషన్లపై విద్యార్థులు, తల్లిద్రండ్రులకు అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం సుమారు 150 మంది వరకు ఎంబీబీఎస్‌లో సీట్లు సాధిస్తు న్నట్టు చెప్పారు. ఈ ఏడాది వెయ్యిలోపు 107 ర్యాంకులు సాధించారని తెలిపారు.ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ మాట్లాడుతూ ఈ ఏడాది నీట్ ద్వారా ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులతో పాటు ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియో(ఆయుష్) కోర్సు లకు ప్రవేశాలు జరుగుతున్నట్టు చెప్పారు.ఆప్షన్స్ ఎంపిక చేసుకు నేటప్పుడు విద్యార్థులు తగు జాగ్రతలు పాటించాలన్నారు.శశి విద్యాసంస్థలో నీట్-2020లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించారు.సమావేశంలో వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మిప్రియ, డైరెక్టర్ మన్నెం వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.