అమరవీరులను సదా స్మరించుకోవాలి : సీఐ
ABN , First Publish Date - 2020-10-28T08:15:15+05:30 IST
ప్రజల రక్షణకు ప్రాణాలర్పి ంచిన అమర వీరులను సదా స్మరించుకోవాలని సీఐలు ఆకుల రఘు, వీరా రవికుమార్ పేర్కొ న్నారు.

తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 27 : ప్రజల రక్షణకు ప్రాణాలర్పి ంచిన అమర వీరులను సదా స్మరించుకోవాలని సీఐలు ఆకుల రఘు, వీరా రవికుమార్ పేర్కొ న్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం టౌన్, రూరల్ సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం రన్ ఫర్ యూనిటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల్లో అమరవీరుల పట్ల చైతన్యం కలిగించేందుకే వారోత్సవాలు నిర్వహిం చామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ సీతాపతి, ఎస్ఈబీ ఎస్ఐ మస్తానయ్య, వాకర్స్ అసో సియేషన్ సభ్యులు తదితరులు భారీ ర్యాలీ చేశారు.
భీమడోలులో...
భీమడోలు : భీమడోలు పోలీస్ సర్కిల్ పరిధిలోని సీఐతో పాటు, ఎస్ఐలు సిబ్బంది మంగళవారం గ్రామంలో రన్ఫర్ యూనిటి నిర్వహిం చారు.సీఐ సుబ్బారావు ఆధ్వ ర్యంలో భీమడోలు, దెందులూరు, ద్వారకా తిరుమల మండలాలకు చెందిన ఎస్ఐలు, 30 మంది సిబ్బంది భీమడోలు జంక్షన్ నుంచి పోలీస్స్టేషన్ వరకూ రన్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో వ్యాయామాలు చేశారు.